ఒంగోలు : బెల్లంకొండ విద్యాసంస్థలు విద్యార్ధులను వేధింపులకు గురిచేయడానికి నిరసనగా వైఎస్ఆర్‌సిపి విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నానిర్వహించారు. ధర్నానుద్దేశించి వైసిపి విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంపుగుడి శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్ధులను వేధింపులకు గురిచేసిన విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అనంతరం సంయుక్త కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.