చీరాల : ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని రావిచెట్టు ప్రాంతంలో గడప గడపకు నవరత్న పథకాలను వివరిస్తూ ” రావాలి జగన్ – కావాలి జగన్ ” కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ యడం బాలాజీ మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసేందుకు వైఎస్ఆర్ తనయుడు జగన్ వస్తేనే సాధ్యమని చెప్పారు. వైసిపి అమలు చేస్తున్న తొమ్మిది రకాల సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన వెంట గ్రామ అధ్యక్షుడు గుద్దంటి సుధాకర్, గోలి వెంకట్రావు, గోలి అంజలీదేవి, ఎంపిటిసి గోలి ఆనందరావు, యడం రవిశంకర్ పాల్గొన్నారు.