Home విద్య పేస్ ఇంజ‌నీరింగ్ కాలేజిలో సృజ‌న మేనేజ్‌మెంట్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

పేస్ ఇంజ‌నీరింగ్ కాలేజిలో సృజ‌న మేనేజ్‌మెంట్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

368
0

ఒంగోలు : పేస్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ఎంబిఎ 8వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సృజ‌న మేనేజ్‌మెంట్ ఫెస్ట్ 2కె18 మార్చి 1న నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ అండ్ క‌ర‌స్పాండెంట్ ఎం శ్రీ‌ధ‌ర్‌, ప్రిన్సిపాల్ ఎం శ్రీ‌నివాస్ తెలిపారు. ఫెస్ట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో ఆవిష్క‌రించారు. ఎంబిఎ చ‌దువుకున్న విద్యార్ధులు ప‌రిశ్ర‌ల అవ‌స‌రాల‌కు అనువైన నైపుణ్యం అభివృద్ది చేసుకోవాల‌న్నారు.

రాష్ట్రంలోని అన్ని క‌ళాశాల‌ల‌కు ఫెస్ట్ ఆహ్వానం పంపుతున్న‌ట్లు చెప్పారు. పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌, క్విజ్‌, నూత‌న పారిశ్రామిక సంబంధాలు వంటి పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విజేత‌ల‌కు బ‌హుమ‌తులు, సర్టిఫికేట్లు అంద‌జేస్తామ‌న్నారు. ఇలాంటి ఫెస్ట్‌ల వ‌ల్ల విద్యార్ధుల‌ను పోటీప‌రీక్ష‌ల‌ప‌ట్ల ప్రోత్స‌హించ‌వ‌చ్చ‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఎంబిఎ హెచ్ఒడి టి మేరిజోన్స్ పాల్గొన్నారు.