చీరాల (DN5 News) : ఇంటర్మీడియట్ ఫలితాలలో శ్రీ గౌతమీ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. కళాశాల స్థాపించినప్పటి నుండి ప్రతిఏటా సాధిస్తున్న ఫలితాల పరంపర కొనసాగించారు. అన్ని విభాగాలలో జిల్లా స్థాయిలో అగ్రస్థానాలు సాధించి కళాశాల ప్రతిష్ట మరింత పెంచారు. జూనియర్ ఎంపీసీలో మీసాల అక్షర 466 మార్కులు సాధించి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచినట్లు డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు.
465 మార్కులతో ఎండి రహమద్ బాషా, వై ప్రవీణ్ కుమార్, బి మోహన ప్రియ రెండవ స్థానంలో నిలిచారు. బైపీసీలో ఎం భవ్యశ్రీ 450 మార్కులు సాధించి జిల్లాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎంపీసీలో 460కుపైగా 24 మంది సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 988 మార్కులతో డి సాహితి, బి పూర్ణ పృథ్వీ, ఎస్ కౌషిత అగ్రస్థానంలో నిలిచారని తెలిపారు.
987 మార్కులతో జె చరితశ్రీ, బి శ్రీచంద్రిక ద్వితీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో ఆర్ దేవవర్షిణి 985 మార్కులు సాధించి అగ్రస్థానం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. తమ విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. క్రమశిక్షణ, కృషి, నిష్ణాత ఉపాధ్యాయ బృందం కారణంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.






