Home క్రైమ్ బాలిక‌ను రేప్ చేశార‌నే… స్టేష‌న్ నుండి లాక్కొచ్చి

బాలిక‌ను రేప్ చేశార‌నే… స్టేష‌న్ నుండి లాక్కొచ్చి

450
0

ఇటానగర్ : ప‌న్నెండేళ్ల చిన్నారి ఈనెల 12న క‌నిపించ‌కుండా పోయింది. వారం రోజుల త‌ర్వాత స‌మీపంలోని టీ గార్డెన్‌లో నగ్నంగా చిన్నారి శ‌వ‌మై క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి విచారించారు. పోలీసులు బాలిక మృత‌దేహానికి పోస్టుమార్టం చేయించారు. అత్యాచారం జ‌రిగిన‌ట్లు పోస్టుమార్టంలో తేలింది. పోలీసు విచార‌న‌లో అస్సాంకు చెందిన వ‌ల‌స కూలీల‌లు సంజ‌య్ స‌బ‌ర్ (30), జ‌గ‌దీష్ లోహ‌ర్ (25)గా గుర్తించారు. ఇద్ద‌రినీ అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్‌లో నిర్భందించారు.

చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ ముద్దాయిలు ఇద్దరూ పోలీసు స్టేష‌న్‌లో ఉన్నార‌ని తెలుసుకున్న గ్రామ‌ ప్రజలు సుమారు వెయ్యి మంది వ‌ర‌కు పోలీసు స్టేష‌న్‌పై దాడి చేశారు. స్టేష‌న్‌లో ఉన్న ఇద్ద‌రు ముద్దాయిల‌ను ఈడ్చుకొచ్చారు. అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన పోలీసుల‌పైనా ప్ర‌జ‌లు దాడి చేశారు. వాక్రో స‌ర్కిల్‌లోని నామ్‌గో గ్రామంలో చిన్నారిపై అత్యాచారం, హ‌త్య‌కు పాల్ప‌డ్డ ఇద్ద‌రు ముద్దాయిల‌ను క‌ర్ర‌లు, రాళ్ల‌తో కొట్టి చంపారు.

ఈ ఘటనపై ఆగ్రహాంతో ఉన్న నామ్‌గో గ్రామస్థులు నిందితులు తేజూ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న విషయం తెలుసుకున్నారు. కర్రలతో ఒక్కసారిగా స్టేషన్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకోవటానికి పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి నగ్నంగా మార్చారు. ఆపై రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ ఖండించారు. ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసి ఎస్పీని బదిలీ చేశారు. ఖండూ ప్రభుత్వం ఘటనపై మెజిస్టేరియల్‌ విచారణకు ఆదేశించింది. ఈశాన్య రాష్ట్రాల్లో గత మూడేళ్లలో ఇది రెండో ఘ‌ట‌న‌. 2015లో దిమాపూర్‌(నాగాలాండ్‌)లో ఇలాగే ఓ రేప్ కేసులో నిందితుడిని ప్ర‌జ‌లే కొట్టి చంపారు.