చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో మార్చి 9, 10తేదీలలో కళాశాల 14వ జాతీయ టెక్నికల్ సిపోజియం వైభవ్ 2018నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. వైభవ్ 2018కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా విద్యార్ధులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నటు్ల తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు రూ.5లక్షల విలువైన బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
వైభవ్ కార్యక్రమానికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. వివరాలకు ఈవెంట్ వెబ్‌సైట్ www.vaibhav2018.in లో వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. విద్యార్ధులు వివిధ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు.
వైభవ్ 2018 కన్వీనర్ డాక్టర్ పి హరిణి మాట్లాడుతూ 14వ జాతీయ టెక్నికల్ సింపోజియం వైభవ్ 2018లో పేపర్ ప్రజెంటేషన్, స్పార్ధ (టెక్నికల్ క్విజ్), సావిస్కార (ప్రాజెక్టు ఎక్క్‌ఫో), సావివారా (పోస్టర్ ప్రజెంటేషన్), నాకౌట్ (డిబేట్) విభాగాలలో పోటీలు, ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, అడ్మినిస్ర్టేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి, హెచ్ఒడిలు పాల్గొన్నారు.