చీరాల : విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ఎంఎస్‌సి ఆయిల్, ఫ్యాట్స్ అండ్ పెట్రో ప్రాడక్ట్స్ విద్యార్ధులు శుక్రవారం ఫేర్‌వెల్ సెలబ్రేషన్న్ నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అడ్డగడ వేణుగోపాల్ మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్ధుల్లో ఐక్యతా భావం పెరుగుతుందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాలేజీ యాజమాన్యం ఉపాధి అవకాశాలను పుష్కలంగా ఉన్న కోర్సులను నిర్వహిస్తుందని చెప్పారు.
ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ తోటకూర సాంబశివరావు మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోనే ఒక్క విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో మాత్రమే ఆయిల్ టెక్నాలజీ కోర్సు నిర్వహించడం ఈ ప్రాంత విద్యార్ధుల అదృష్ణమన్నారు. ఆయిల్ టెక్నాలజీ హెచ్ఒడి జె ఫణికిషోర్ మాట్లాడుతూ కోర్సు పూర్తి కాకముందే విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కష్టపడే తత్వాన్ని పెంపొందించుకోవాలని, భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు జె చార్లీనా, పద్మావతి, అశోక్ పాల్గొన్నారు.