Home ప్రకాశం కొండెపిలో టిడిపికి తప్పని ఆధిపత్య పోరు

కొండెపిలో టిడిపికి తప్పని ఆధిపత్య పోరు

445
0

కొండపి : కొండపీ టిడిపి ముసలం ముదిరింది. ఎమ్మెల్యే స్వామికి పోటీగా మరో శిభిరం రూపుదిద్దుకుంటుంది. నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల ముఖ్య నేతలు సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రి నారాయణ, పార్లమెంట్ ఇంచార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావును కలిసి కొండపి ఎమ్మెల్యే స్వామిని మార్చి పార్టీని కాపాడాలని కోరారు. చంద్రబాబును మళ్ళీ 2019లో ముఖ్యమంత్రిగా చెయ్యడంలో, ఒంగోలు పార్లమెంట్ గెలుపులో కొండపి నియోజకవర్గ పాత్ర కీలకమైనదని వివరించారు.

మంచి నిర్ణయం తీసుకొని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త చింతల వెంకటేశ్వర్లు, కంచర్ల ప్రసాద్, చుక్క కిరణ్ కుమార్, ఎస్.కె సలీమ్ బాషా, నేలపాటి బ్రహ్మయ్య, పోటు శ్రీనివాసరావు, కొమ్మలపాటి రాఘవ, కునంనేని రమేష్, గుండపనేని బాలకృష్ణ, చెరుకూరి కృష్ణారావు, పాలడుగు సింగయ్య, ఎంపిటిసిలు, రామారావు, వెంకటేశ్వర్లు, చెన్నయ్య, ఎస్డి మహాభాషా, రామకృష్ణ తదితరులు 20 వాహనాల్లో 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.