ఇంకొల్లు : సూదివారిపాలెంలో పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ సమన్వయ కర్త రావి రామనాధంబాబు పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు. గ్రామస్తులు ఫించన్లు రావడం లేదాని, పక్కాగృహాలు మంజూరుచేయడంలేదని రామనాధంబాబు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయన స్పందిచారు. పేదవర్గాలకు అందాల్సిన పధకాలు వారికి అందకుండా చేయడం దురదృష్టకరమన్నారు. రాజన్న రాజ్యం తిరిగి రావాలన్నా, సంక్షేమ పదకాలు సక్రమంగా అందాలన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం వుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమలుచేయనున్న నవరత్నాలు పధకాలను వివరించారు. మహిళలకు గతంలో తీసుకున్న డ్వాక్రా ఋణాలు రద్దు తోపాటు తిరిగి పావలావడ్డీకే ఋణాలు ఇవ్వాలని కోరుతున్నారు.
దీంతోపాటు చధువుకొనే పిల్లలకు ప్రతినెలా 5వ తరగతి వరకు 500లు 6నుండి 10వతరగతి వరకు 750 రూపాయలు తల్లుల బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నట్లు చెప్పారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్సమెంట్ తో ఉచిత విద్య 45సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2వేలు నెలకు ఫించను అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఆటోయజమానులకు సంవత్సరానికి 10వేలు వారి ఖాతాలో ఉచితంగా జమచేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ యజమానులకు రోడ్డు టాక్స్ రద్దు చేయనున్నట్లు వివరించారు. ఇంటి నివేశనా స్థలాలు సైతం మహిళలకే ఇవ్వనున్నట్లు జగనన్న హామీ ఇచ్చిన విషయాన్ని వారికి వివరించారు. 5ఎకరాల లోపు వ్యవసాయభూమి ఉన్న రైతులకు ప్రతి ఏటా సీజనుకు ముందే వారి ఖాతాలో 12500ల రూపాయలు చొప్స్న 5సంవత్సరాల పాటు జమచేయనున్నట్లు రామనాధంబాబు గారు వివరించారు. స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి 80శాతం జలప్రాజెక్టులు నిర్మిస్తే చంద్రబాబ నాయుడు వాటిని పూర్తిచేయకుండా ప్రజాధనాన్ని వృధాచేస్తూ పూర్తిచేసినట్లు కాకి లెక్కలు చెబుతువ్విఇరు. సన్మానాలు చేయించుకుంటఃన్నారని విమర్శించారు. తాత్కాలిక ప్రయోజనాలకు తావులేకుండా, శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జగనన్నకు మద్దతు ఇవ్వాలని విజ్జప్తి చేసొరు.