చీరాల : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష్మిధియేటర్ ఎదురుగా ఉన్న నీలం జేమ్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో గంటకు 250లీటర్ల సామర్ధ్యం కలిగిన ఆర్ఒ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్లాంటును రోటరీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ పిడి జి రత్నప్రభాకర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా ఎయిడెడ్ ఉన్నత పాఠశాల విద్యార్ధుల సౌకర్యార్ధం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.
కార్యక్రమంలో రోటేరియన్, ఏరియా వైద్యశాల అభివృద్ది కమిటి ఛైర్మన్ మువ్వల వెంకట రమణారావు, పిడుగురాళ్లకు చెందిన విష్ణు, సికింద్రాబాద్‌కు చెందిన డి సురేష్, చీరాల రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వరికూటి అమృతపాణి, తేళ్ల అశోక్‌కుమార్, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె శ్రీనివాసబాబు పాల్గొన్నారు.