Home ప్రకాశం ఉద్యోగ విర‌మ‌ణ పొందిన ధ‌న‌ల‌క్ష్మికి ఘ‌న స‌న్మానం

ఉద్యోగ విర‌మ‌ణ పొందిన ధ‌న‌ల‌క్ష్మికి ఘ‌న స‌న్మానం

702
0

చీరాల : చీరాల‌ ఆదినారాయణపురం ఎఆర్ ఉన్నత పాఠశాలలో గ‌త‌ 35 సంవత్సరాలుకుపైగా జూనియర్ అసిస్టెంట్గా సేవలందించిన‌ టి.ధనలక్ష్మి ఉద్యోగ విరమణ పొందారు. ఈసంద‌ర్భంగా పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో శ‌నివారం ఉద్యోగ విర‌మ‌ణ అభినంద‌న స‌భ నిర్వ‌హించారు. స‌భ‌కు పాఠ‌శాల‌ ప్రధానోపాధ్యాయులు భవనం బద్రిరెడ్డి అద్యక్షత వ‌హించారు. స్కూల్ కాంప్లెక్స్ క‌మిటి ఛైర్మన్ వంగర అమరలింగయ్య మాట్లాడుతూ పాఠ‌శాల‌లో ఆమె చేసిన సేవ‌ల‌ను ప్ర‌శంశించారు. చేసిన సేవే ఏ ఉద్యోగికైనా గుర్తింపు తెస్తుందన్నారు. కార్య‌క్ర‌మంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంకటరావు, పుష్పరాజు, శ్రీనివాసులరెడ్డి, రామాంజనీదేవి, శ్రీనివాసరావు, సబీహబేగం, రీన, సుహాసిని, రమ్య, హజరత్ పాల్గొన్నారు.