Home వైద్యం రామానంద‌స‌ర‌స్వ‌తి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఉచిత షుగ‌రు వైద్య‌శిభిరానికి విశేష స్పంద‌న‌

రామానంద‌స‌ర‌స్వ‌తి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఉచిత షుగ‌రు వైద్య‌శిభిరానికి విశేష స్పంద‌న‌

511
0

చీరాల : ప్ర‌తినెలా నాలుగో ఆదివారం వాడ‌రేవు రామానంద‌స‌ర‌స్వ‌తి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఉచిత షుగ‌రు వైద్య‌శిభిరం నిర్వ‌హిస్తున్నారు. వేస‌వి కావ‌డంతో మే నెల‌లో వైద్య‌శిభిరానికి హాజ‌రు కావ‌డం రోగుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో రెండు నెల‌ల‌కు ఒకే సారి స‌రిప‌డు మందులు ఉచితంగా అంద‌జేశారు. ఈ విష‌యం తెలుసుకున్న రోగులు సుమారు 1226మంది వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకుని మందులు తీసుకున్నారు. శిభిరానికి హాజ‌రైన రోగుల‌కు ఉచితంగా ర‌క్త ప‌రీక్ష‌లు చేశారు. కేవ‌లం మందుల మీద‌నే కాకుండా ఆహార నియ‌మాలు, వ్యాయామం చేయాల‌ని సూచ‌న‌లు చేశారు.

డాక్ట‌ర్ ఎం రాజరాజేశ్వ‌రి, డాక్ట‌ర్ క‌మ‌లా రాజేశ్వ‌రి, డాక్ట‌ర్ ర‌వికాంత్‌, డాక్ట‌ర్ ల‌లిత్‌ప్ర‌కాష్‌చంద్ర‌, డాక్ట‌ర్ శ్రీ‌కాంత్‌, డాక్ట‌ర్ సుధాకర్ వైద్య ప‌రీక్ష‌లు చేశారు. రోగుల‌కు ఆహారం, మంచినీరు ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించారు. ట్ర‌స్టు ఉపాధ్య‌క్షులు కె కృష్ణారావు, గోపాల్‌, బ‌స‌వ‌రావు, ఎన్ సురేష్‌, ఎ సురేష్‌, ఎంజి శంక‌ర‌రావు, వాడ‌రేవు ఉన్న‌త పాఠ‌శాల‌, చీరాల మ‌హిళా క‌ళాశాల విదా్య‌ర్ధులు రోగుల‌కు సేవ‌లందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 24క్యాంపులు నిర్వ‌ఘ్నంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైద్య‌శిభిరం నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించిన వైద్యులు, సిబ్బందిని రామానంద‌స‌ర‌స్వ‌తి అభినందించారు. బ‌హుమ‌తులు, దృవీక‌ర‌ణ పత్రాలు అంద‌జేశారు.