చీరాల : ఎంసెట్ 2018 ఆన్‌లైన్ పరీక్షలు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రారంభమయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్ధులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు చీరాల, బాపట్ల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు ప్రాంతాల నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ఉచిత భోజనం, చల్లని నీరు, మజ్జిగ, అల్పాహారం అందజేశారు. అత్యవసర సమయంలో వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.