Home ప్రకాశం అంద‌రినీ క‌లుపుకునే స్వ‌భావం ఉంటేనే నాయ‌కుడు : ప‌సుపులేటి

అంద‌రినీ క‌లుపుకునే స్వ‌భావం ఉంటేనే నాయ‌కుడు : ప‌సుపులేటి

663
0

కందుకూరు : నాయకత్వం వహించే వ్యక్తి విశాల దృక్పధంతో అందరిని కలుపుకు పోయేవిధంగా ఉండాలని సైకాల‌జిస్టు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాపారావు పసుపులేటి పేర్కొన్నారు. విజయాలను , వైఫల్యాలను సమాన స్థాయిలో స్వీకరించే గుణం ఉండాలన్నారు. కార్యకర్తల మాటలకు సరైన విలువను ఇవ్వాల‌న్నారు. అలాంటి నాయ‌కునికి వచ్చే సమస్యలను ప‌రిష్క‌రించ‌గ‌లిగిన‌ప్పుడే నాయ‌కుని విలువ ఉంటుంద‌న్నారు. మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. తెలుగు విజయం ప్రాంగణంలో జడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి అధ్యక్షతన జరిగిన 154వ బ్యాచ్ శిక్షణా ముగింపు కార్యక్రమంలో బాగంగా నాయకత్వ లక్షణాల గురించి వివరించారు. విజయం లభించినప్పుడు దానికి కార్యకర్తలను బాధ్యులను చేయాలనీ, వైఫల్యం వచ్చినప్పుడు కార్యకర్తలలో దైర్యాన్ని నింప గలిగినప్పుడే ఒక నాయకునిగా అతని సమర్ధత తెలుస్తుందన్నారు. సమయపాలన పాటిస్తూ కార్యకర్తలో ఒకరిగా, వారి కుటుంభ సభ్యునిగా ఉంటూ, ప్రభుత్వ పథకాల మీద అవగహన కలిగి, అర్హులైన వారికి వాటిని అందించే విధం గా కృషి చేయగలిగినప్పుడే గ్రామ స్థాయి లో సమర్ధ నాయకునిగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్య కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వడం, నిరాడంబరంగా, నిజాయితీ, నైతిక విలువలతో వ్యవహరించాల‌న్నారు. ప్రచార మాధ్యమలతో సత్సంబంధాలు కొనసాగించడం వంటి వాటి ద్వార మంచి గుర్తింపు పొందవచ్చని వివరించారు. రాజకీయాలలో ఒత్తిడి అత్యంత సహజమని, నడక, యోగ, ధ్యానం, సమయ పాలన, సరైన ప్రణాలిక,పధకాల మీద అవగాహన ద్వార వాటిని అధిగమించవచ్చని తెలియజేసారు.

భ‌హుమ‌తులు పంపిణీ
అనంతరం విజేతలకు బహుమతులు, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ అందించారు. శిక్షణకు గుంటూరు జిల్లా వేమురు, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి, ప్రకాశం జిల్లా కందుకూరు, దర్శి, మార్కాపురం, నెల్లూరు జిల్లా ఉదయగిరి, సుల్లురు పేట, వెంకట గిరి నియోజక వర్గాల గ్రామా, మండల, స్థాయి నాయకులూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిభిరం కో ఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జున్, కందుకూరు జడ్పీటీసీ కంచర్ల శ్రీకాంత్ చౌదరి ,శిక్షకులు పరమేశ్వర రెడ్డి, చైతన్య పాల్గొన్నారు.