Home ప్రకాశం కందుకూరులో విజ‌య హాస్పిట‌ల్ ప్రారంభం

కందుకూరులో విజ‌య హాస్పిట‌ల్ ప్రారంభం

556
0

కందుకూరు : ప్రకాశం జిల్లా కందుకూరు ప‌ట్ట‌ణం పామూరు రోడ్లోని రాజ్ సినిమా హాల్ ఎదురుగా నూతనంగా విజయ హాస్పిటల్‌ను శుక్ర‌వారం ప్రారంభించారు. డాక్టర్ బాలకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను కందుకూరు ఎంఎల్ఎ పోతుల రామారావు, మాజీ ఎంఎల్ఎ డార్ దివి శివరాం, డాక్టర్ అజ్మల్ హుస్సేన్ ప్రారంభించారు.

హాస్పిటల్‌ను శివరాం, ఐసియు విభాగాన్ని పోతుల రామారావు, మెడికల్ షాప్‌ను డాక్టర్ అజ్మల్ హుస్సేన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బెజవాడ సుబ్బారావు, మాజీ శాసన సభ్యులు కసుకుర్తి ఆదేన్న, కందుకూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, సైకాలజిస్ట్ ప‌సుపులేటి పాపారావు పాల్గొన్నారు. డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ త‌మ హాస్పిట‌ల్‌లో అందిస్తున్న‌ సౌక‌ర్యాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ఆనంద్‌కుమార్‌, డాక్ట‌ర్ న‌రేంద్ర పాల్గొన్నారు.