చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో వేణుగోపాలస్వామి రధోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా స్వామివారిని గ్రామంలో మంగళవాధ్యాలతో భక్తులు ఊరేగించారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
స్వామివారిని దర్శించుకున్న పారిశ్రామికవేత్త, దేవాంగపురి సజ్జా బాలానందం ట్రస్టు ఛైర్మన్ సజ్జ వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటి ఛైర్మన్ బూదాటి ప్రకాశం, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, పంచాయితీ వార్డు సభ్యలు అందె ఆదిలక్ష్మి, మాగం మురళి, మాజీ ఎంపిటిసి పార్ధసారధి, పింజల సాంబశివరావు పాల్గొన్నారు.