చీరాల : యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ మహిళా కళాశాలలో అన్ని సంవత్సరాల బికాం., బిఎస్‌సి విద్యార్ధుల తల్లిదండ్రులు, కళాశాల అద్యాపకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ మాట్లాడారు. విద్యార్ధుల సమస్యలు, అభివృద్ది అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు డి ధాత్రికుమారి, గణిత అధ్యాపకులు శ్రావణి, స్టాటిస్టిక్ అధ్యాపకులు శ్రావణి, వైస్‌ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కామర్స్ అధ్యాపకులు హరిహరప్రసాద్ పాల్గొన్నారు.