చీరాల : ప్రకాశం జిల్లా చీరాల ఆల్టస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు నాయకత్వ లక్షణాలు కలిగిన విద్యార్ధులను నియమించడానికి విద్యార్ధులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగాయి. విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆరు పదవులకు 16మంది విద్యార్ధులు నామినేషన్లు వేశారు. ఆరు కేటగిరీలకు ఆరుగురు ఎన్నికయ్యారు. విజయం సాధించిన విద్యార్ధుల్లో ఒకరు హెడ్ బాయ్, ఒకరు హెడ్ గాల్, వైస్ హెడ్ బాయ్, వైస్ హెడ్ గాల్, ప్రిఫెక్ట్ బాయ్, ప్రీఫెక్ట్ గాల్ ఎన్నుకున్నారు. ఎన్నికలలో విద్యార్ధులతోపాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్ధులను ఉత్సాహపర్చారు.