చీరాల : విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులు పెద్ది సీతారామయ్య శనివారం మృతి చెందారు. ఈసందర్భంగా కళాశాల ఆవరణలో సంతాప సభ నిర్వహించారు. సభలో ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య మాట్లాడారు. ఇంగ్లీష్ హెడ్ టి పోలయ్య మాట్లాడుతూ ఆంగ్ల విద్యా బోధనలో సీతారామయ్య చేసిన సేవలు మరువలేనివన్నారు. విద్యార్ధుల ఉన్నతికి అనేక సూచనలు చేసిన సీతారామయ్యకు నివాళులర్పించారు.