చీరాల : విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న నైపుణ్యాభివృద్ది శిక్షణా శిభిరం శనివారంతో ముగిసింది. ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు. కళాశాల పిజి కామర్స్ విభాగ రీడర్ డాక్టర్ ఎ సతీష్‌బాబు స్కిల్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ పిఎస్ కిరణ్‌కుమార్, ఎ శ్రీనివాసరావు, జి రమేష్, ట్రైనర్ పి రోషన్, కోఆర్డినేటర్ జి అనీష్ విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. వివిధ అంశాల్లో నైపుణ్యం నేర్చుకోవడం ద్వారా ప్రతివిద్యార్ధి ఉన్నతమైన స్థితికి ఎదగవచ్చన్నారు. పెరుగుతున్న పోటీని తట్టుకుని విద్యార్ధులు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే కమ్యునికేషన్ స్కిల్స్ అవసరమన్నారు. అనంతరం శిక్షణకు సంబంధించిన దృవీకరణ పత్రాలు అందజేశారు.