చీరాల : విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలను రాష్ట్ర కాలేజి ఎడ్యకేషన్ కమిషనరేట్‌కు సంబంధించిన అకడమిక్ ఆఫీసర్ పి వేణుగోపాల్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన కళాశాల ప్రిన్సిపాల్ మన్నేపల్లి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో అధ్యాపకులతో సమావేశమయ్యారు. కళాశాల అడ్మిషన్ల తీరును అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్లు పెంచుకునేందుకు సూచనలు చేశారు. విద్యార్ధినీ, విద్యార్ధులకు అవసరమైన వసతులు, మరుగుదొడ్లు నిర్వహణ, తరగతి గదులు, ఆటస్థలం అన్నీ పరిశీలించారు. అనంతరం ఆయనను కళాశాల సిబ్బంది సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాల, వేటపాలెం బిబిహెచ్ కళాశాల, చీరాల వైఎ ప్రభుత్వ మహిళా కళాశాలలను ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు పిఎస్ కిరణ్‌కుమార్, డాక్టర్ ఎ సతీష్‌బాబు, వై సుబ్బారాయుడు, పి దినేష్‌బాబు, డాక్టర్ బి రాధ, జె శ్యామలదేవి, ఎ శ్రీనివాసరావు, డాక్టర్ కె నరేష్‌కుమార్, ఎన్ సుధాకర్ పాల్గొన్నారు.