కర్లపాలెం : ఉద్యోగ విరమణ పొందిన తహశీల్దారు సుందరమ్మను స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆర్య వైశ్య కల్యాణ మండపంలో శాలువాలు, పూల మాలలతో గురవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్‌డిఓ పి గ్లోరియా, కర్లపాలెం, బాపట్ల, పిట్టలవానిపాలెం తహశీల్దార్లు పాషా, సలీమా, డి వెంకటేశ్వరరావు, ఎంపిడిఓ అద్దురి శ్రీనివాసరావు, డిటి శ్రీదేవి పాల్గొన్నారు.