బాపట్ల : సూర్యలంక సముద్ర తీరం వద్ద ఉన్న తుఫాన్ షల్టర్‌లో అడివి పంచాయతీ అధికారులు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. బల్లలు, గొడుగులు, సామాను భద్రపరుచు కునే గదికి వేలం పాట నిర్వహించారు. బల్లలు, గొడుగులు వేలం పాట వాయిదా వేశారు. సామాను భద్రపర్చుకునే గది ఒక్క అంశాన్నే వేలం నిర్వహించగా వేలంలో పాల్గొన్న పర్రె కోటయ్య రూ.57,500 హెచ్చు పాటతో దక్కించుకున్నారు.