చీరాల : జాతీయ చేనేత సదస్సు ఆగష్టు 7న చీరాలలో నిర్వహించనున్నారు. సదస్సుకు సిఎం చంద్రబాబు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని 13జిల్లాల చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలుగో సిఎం కావడంతో ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ కూడా సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్ కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా చీరాల పర్యటనకు ఆమంచి సారధ్యంలోనే వచ్చారు. వీరికాలంలోనే వాడరేవులో మినీ హార్భర్ నిర్మాణానికి రూ.400కోట్ల నిధుల అనుమతులు పొందారు. ఇతర అభివృద్ది పనులకు నిధులు రాబట్టారు.