చీరాల : మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపిపి గవిని శ్రీనివాసరావు కోరారు. ఎన్ఆర్ఇజిఎస్, స్త్రీనిధి భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కేటాయించిన డంపింగ్ యార్డులు, స్మశానాల ప్రహరీగోడలు, గ్రామీణ పార్కుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎపిడి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎపిఒ సుమతి, జెఇ సురేష్, టిఎ నాగరాజు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఎంపిటిసి పాపగాని శ్రీనివాసరావు, ఎరిచర్ల స్వామిదాసు పాల్గొన్నారు.