Home సినిమా అస‌భ్యంగా మాట్లాడితే బ్లాక్ చేస్తాన‌న్న త్రిష‌

    అస‌భ్యంగా మాట్లాడితే బ్లాక్ చేస్తాన‌న్న త్రిష‌

    0
    0

    హైదరాబాద్ : సినిమా రంగంలో ఉన్న‌వాళ్ల‌పై ద్వందార్ధాల‌తో స్పందించే నెటిజ‌న్లు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ల‌లో ఒక అభిమాని త్రిష టైమ్‌లైన్‌లో త్రిష‌ సహ నటుల గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. త్రిష ఆ అభిమాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిష ఆ నెటిజన్‌ వివరాలు చెప్పకుండా అతన్ని త‌న టైమ్‌లైన్‌లో బ్లాక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘నా టైంలైన్‌లో అసభ్యకరంగా మాట్లాడటమా..! నా పట్ల నీకున్న అభిమానం నిరూపించుకోవడానికి ఇతర నటీనటులను అమర్యాదకరంగా మాట్లాడతావా? లేదంటే నన్ను ఈ విధంగా వేధించాలని చూస్తున్నావా? నిన్ను నా టైమ్‌లైన్‌లో బ్లాక్‌ చేయబోతున్నాను’ అంటూ త్రిష‌ ట్వీట్ చేశారు.

    సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో త్రిష.. కార్తిక్ ప్ర‌స్తుతం నటిస్తున్నారు. ఆమె సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జోడీగా అందులో నటిస్తున్నారు. త్రిష, రజనీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కూడా. ప్రముఖ నటి సిమ్రన్ అందులో మరో కథానాయికగా నటిస్తున్నారు. మరోపక్క ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సేతుపతికి జోడీగా త్రిష.. విజయ్‌ ‘96’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు. మంచి స్పందన లభించింది.