చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ర్టానిక్ అండ్ కమ్యునికేషన్స్, ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్స్ విభాగాలు సంయుక్తంగా ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్‌మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఎలక్ర్టికల్, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ అంశంనై అంతర్జాతీయ సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు.
సదస్సులో హైదరాబాద్ మహీంద్రా ఎకోల్ సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ బిఎస్ రావు వివరించారు. ఆధునిక జీవన విధానం టెక్నాలజీపై పరుగులు తీస్తుందన్నారు. టెక్నాలజీ ఫలితాలు అందరికీ అందాలని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యురిటీ వంటివి ప్రధానపాత్ర వహిస్తాయన్నారు. ఆధునిక మానవ జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. మనదేశం నుండే కాకుండా విదేశాల నుండి 50మంది పరిశోధనా పత్రాలు పంపినట్లు తెలిపారు. సదస్సుకు ప్రొఫెసర్ కె జగదీష్‌బాబు, డాక్టర్ ఎ పూర్ణచంద్రరావు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.