చీరాల : విఠల్ నగర్‌లోని చైతన్య మనోవికాసకేంద్రంలో ఐకాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్యశిభిరం నిర్వహించారు. శిభిరంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్ కొండలరావు, డాక్టర్ పి సందీప్, మనోవికా కేంద్రం డైరెక్టర్ ఎన్ వెంకన్నబాబు, ప్రిన్సిపాల్ ఎన్ మాధురి, కిషోర్ పాల్గొన్నారు.