చీరాల : జోరున కురుస్తున్న వర్షం. అయినప్పటికీ జాతీయ పతాకావిష్కరణలు జరిగాయి. మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. విద్యార్ధులు, అద్యాపకులే కాదు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం జెండా వందనంకు హాజరయ్యారు. వానను సైతం లెక్కచేయకుండా జాతీయ పతాకావిష్కరణ చేశారు. కోర్టు భవనాల ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్ కృష్ణన్‌కుట్టి తొలుత స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం కోర్టు ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ వద్ద సిఐ వి సూర్యనారాయణ తన సిబ్బందితోపాటు పాఠశాల విద్యార్ధుల సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరించగా తహశీల్దారు ఎం వెంకటేశ్వర్లు సిబ్బంది, రెడ్‌క్రాస్ ప్రతినిధులతో కలిసి తన కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు.
మండల పరిషత్ అభివృద్ది కార్యాలయం వద్ద ఎంపిపి గవిని శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థల్లోనూ ఆయా సంస్థల అధినేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.