చీరాల : చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా నేరాలు అదుపు చేయవచ్చని సీనియర్ సివిల్ జడ్జ్ కృష్ణన్ కుట్టి పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా నవంబర్ 9న న్యాయం సేవా దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి తప్పుకు ఎలాంటి శిక్ష పడుతుందో అవగాహన కల్పిస్తే తప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు, సిఐ భక్తవత్సలరెడ్డి, రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ ఠాకూర్ పాల్గొన్నారు.