బాపట్ల : టిడిపి బాపట్ల నియోజకవర్గ నాయకులు, వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ వేగేశన నరేంద్రవర్మ శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కలిశారు. నియోజకవర్గంలో తాను చేస్తున్న పార్టీ కార్యక్రమాలను వివరించారు. గ్రామ పలకరింపుతో పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న తీరును సిఎంకు వివరించారు. అయితే తాను మాత్రం మర్యాదపూర్వకంగానే సిఎంను కలిసినట్లు పేర్కొన్నారు.