చీరాల : చేనేత వృత్తిపై కేంద్రప్రభుత్వం విధించిన జిఎస్‌టిని రద్దు చేయాలని వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర ప్రచార కమిటి కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్ కోరారు. చేనేత, వస్ర్తవ్యాపరంలో చినబొంబాయిగా పేరున్న చీరాల ప్రాంతంలో చేనేత, ఇతర చేతివృత్తుల రక్షణకు వైసిపి అధికారానికి వస్తే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అత్యధికమంది ఉపాధి పొందుతున్న చేనేత రంగం రక్షణకు పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. కార్మికులకు వ్యక్తిగత రుణాలు ఇప్పించేందుకు తమపార్టీ కృషి చేస్తుందన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ అనేక సమస్యల అధ్యయనం అనంతరం పేదల సంక్షేమానికి తన తండ్రి వైఎస్ఆర్ బాటలో నవరత్నల్లాంటి పథకాలు ప్రకటించారని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలు వైసిపి విజయానికి కృషి చేయాలని కోరారు. చీరాలలో ప్రవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన వెంట శిద్ది ప్రసాద్, టి వెంకటేశ్వర్లు, ఏసుపాదం, ఎ వెంకటేశ్వర్లు, ఎన్ మూర్తి, కె హనుమంతరావు, జి మోహనరావు, కలుమూరి ఆదినారాయణ పాల్గొన్నారు.