Home ప్రకాశం నైపుణ్యాభివృద్దికే నెక్ట్స్ జెన్‌….

నైపుణ్యాభివృద్దికే నెక్ట్స్ జెన్‌….

317
0

చీరాల : విద్యార్ధుల్లో వ్య‌క్తిగ‌త నైపుణ్యాభివృద్దికే గీతా స‌ర్వీస్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నెక్స్ట్ జెన్ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు గీతా స‌ర్వీస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ వ‌లివేటి ముర‌ళీకృష్ణ పేర్కొన్నారు. ఆదినారాయణపురం ఎఆర్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు మాట్లాడే నైపుణ్యాలను పెంచేందుకు నెక్స్ట్ జెన్ ప్రోగ్రాం ప్రత్యేక శిక్షణా చేప‌ట్టామ‌న్నారు. తరగతులను ప్రధానోపాధ్యాయులు భవనం బద్రిరెడ్డి ప్రారంభిచారు. విద్యార్ధులకు కమ్యునికేషన్ స్కిల్స్, సమర్ధవంతంగా, జనరంజకంగా, వినసొంపుగా, మాట్లాడే నైపుణ్యాలపై త‌మ‌ ట్రస్ట్ శిక్షకులు సునీల్ అద్వర్యంలో వారంలో ఒకరోజు ప్రత్యేక తరగతులను నిర్వహింనున్నట్లు తెలియజేసారు.

ప్రధానోపాధ్యాయులు బ‌ద్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్ధిని పాఠశాల స్థాయిలోనే మాంచి జెమ్ గా తాయారు చేయాలనే సంకల్పంతో గీతా ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచారని అన్నారు. ఇలాంటి శిక్ష‌ణ‌ను అందరు చక్కగా ఉపయోగించు కొని మంచి స్తితికి ఎదగాలని ఆకాంక్షించారు. ట్ర‌స్ట్‌ సేవలను కొనియాడాడు. కార్యక్రమంలో ఉపాద్యాయులు వెంకటరావు, పుష్ప రాజు, శ్రీనివాసులరెడ్డి, శ్రీనివాసరావు, రామంజనిదేవి, సబిహ బేగం, మాధవి , హజరత్, విద్యార్ధులు పాల్గొన్నారు.