Home జాతీయం మోడీ పాలనలో భారీ స్కామ్… బయటపడ్డ సంచలనం

మోడీ పాలనలో భారీ స్కామ్… బయటపడ్డ సంచలనం

401
0

అమరావతి : కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా అవినీతిమయం… కుంభకోణాల భారతం. ఈ నాలుగేళ్లలో ఒక్క అవినీతి మరక కూడా లేకుండా స్వచ్ఛమైన పాలన అందించామని బీజేపీ నేతలు గొప్పలు పోతుంటారు. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత దేశాన్ని దోచుకున్న అవినీతి పరులంతా ఎంచక్కా విదేశాల్లో విలాసాలు అనుభవిస్తున్నారు. బ్యాంకులను ముంచి దేశం దాటేసిన బ్యాచ్ గురించి అసలు మాట్లాడవద్దని బీజేపీ నేతలు కోరుతుంటారు. అసలవి స్కాములే కాదని అవినీతి అంతకంటే కాదని బుకాయిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే విజయ్ మాల్యా, నిరావ్ మోడీ ఇలా వారందరూ కాంగ్రెస్ హయంలోనే బ్యాంకుల దగ్గర అప్పులు చేశారు కాబట్టి ఈ పాపం కూడా కాంగ్రెస్ దే అని తప్పించుకుంటారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం దాటేశారు కదా అంటే దానికి నోరు మెదపరు. ఇలాంటి తరుణంలో మోడీ హయాంలో జరిగిన భారీ కుంభకోణం మరొకటి బయటకోచింది.

మోడీ మీద యుద్ధం ప్రకటించిన టీడీపీ ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. కేంద్రం ప్రభుత్వంపై, ప్రధాని కార్యాలయంపై ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ఆర్‌ ఆయిల్‌ ఒప్పందంలో రష్యా కంపెనీతో కలిసి బీజేపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ బాంబ్ పేల్చారు. ఎస్ఆర్ ఆయిల్ కంపెనీ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో ఎస్ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం జరిగిందని, ఆయన సమక్షంలో జరిగిన ఒప్పందానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు.

ఈ వ్యవహారంలో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారని కుటుంబరావు పేర్కొన్నారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కుటుంబరావు.. ఈ ఒప్పందం ద్వారా దేశానికి రావాల్సిన టాక్స్ ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. రష్యాకు చెందిన ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం జరిగితే.. ప్రభుత్వానికి – ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగినట్టు చూపెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ పదేపదే విదేశాలు తిరగడం.. ఎస్ఆర్‌ ఆయిల్‌ కుంభకోణం డబ్బుల కోసమేనని అన్నారు.

ఎస్ఆర్‌ ఆయిల్‌ వ్యవహారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌… అక్కడి మంత్రిని అరెస్ట్ చేయించారని చెప్పారు. ఈ ఒప్పందం జరిగిన సమయంలో ప్రధాని మోదీ చైనాలో అనధికారికంగా పర్యటించారని కుటుంబరావు తెలిపారు. అంతర్జాతీయ విషయం కావడంతో సమాచారం సేకరించేందుకు సమయం పట్టిందని వివరించారు. బీజేపీతో సంబంధాలు తెగిపోయాయి కాబట్టి ఇప్పుడు కుంభకోణం గురించి మాట్లాడుతున్నారనడం సరికాదని పేర్కొన్నారు. ఎస్ఆర్‌ ఆయిల్ కుంభకోణం వ్యవహారాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని కుటుంబరావు స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీల దృష్టికి ఈ కుంభకోణం గురించి తెలియజేస్తామని చెప్పారు. ఈ కుంభకోణం వ్యవహారం లోక్ సభను అతలాకుతలం చెసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏమి చర్చిస్తారో చూడాల్సిందే…