అమరావతి : ఊసరవెళ్లి రంగులు మార్చడం గురించి చెబితే ఎలా ఉంటుంది? కుంభకోణాలు చేయడం నేరమని హర్షద్ మెహతా చెబితే ఏమనిపిస్తుంది? జగన్ చెప్పే హామీలు, నీతులు వింటుంటే అచ్చం అలాగే అనిపిస్తుంది. వస్తే కట్టలు తెంచుకునేంత కోపం వస్తుంది. లేకుంటే పగలపడి నవ్వేంత నవ్వు వస్తుంది. జగన్ ఇచ్చే హామీలు విన్నాక ఏం చేయాలో పాఠకులే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వైసిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నోట అలాంటి ఆణిముత్యాల్లాంటి పలుకులు రాలిపడ్డాయి కాబట్టి. పాదయాత్రలో ఉన్న జగన్ ఒక టివి ఛానల్ తో మాట్లాడారు. ఎవరేమనుకుంటే తనకెందుకునిపించేదమో బేఫికర్ గా సుద్దులు చెప్పారు. పనిలో పనిగా కేంద్రంలో మోడీ పాలనకు సున్నా మార్కులు వేస్తానని తేల్చేశారు. ఎందుకంటే మోడీకి తెలుగు రాదు కదా? అనుకున్నారేమో.
రాష్ట్రానికి విభజన హామీల్లోని అన్నీ నెరవేర్చామని ఇక ఇచ్చేదేమీలేదని బిజెపి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు నోరుమెదపడి జగన్ ఇప్పుడెందుకు అలా స్పందించాల్సి వచ్చింది? ఇది వెయ్యి డాలర్ల ప్రశ్నే. ఇదిలా ఉంటే తాను అధికారంలోకి వస్తే అవినీతి అన్నది లేకుండా చేస్తానని చెప్పడం. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. దాదాపు 12 ఛార్జిషీట్లలో ఏ1గా ఉండి… ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి కోర్టు యాత్ర చేస్తున్న జగన్ అవినీతి లేకుండా చేస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉంది. రూ.లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు, ఏడాదిన్నర జైలులో గడిపి వచ్చిన జగన్ తాను ముఖ్యమంత్రి అవ్వగానే అవినీతి లేకుండా చేస్తానని చెప్పడం హాట్‌టాపిక్ అయ్యింది.
రేపో మాపో జగన్ జైలుకు పోవడం ఖాయమని టీడీపీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే ప్రధాని మోడీని విమర్శించకుండా జైలుకు పోకుండా తనను తాను కాపాడుకుంటున్నారని టీపీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏ రోజు అయితే మోడీని ఆయన ప్రశ్నిస్తారో ఆ రోజే ఆయన జైలుకు పోవడం ఖాయమన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాటలు. అలాంటి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ తాను అధికారంలోకి రాగానే అవినీతిని లేకుండా చేస్తానని చెప్పడం ఎంత పెద్ద సాహసమో చెప్పలేం.
ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనకు సున్నా మార్కులు వేస్తానని జగన్ అన్నారు. ఇక తాను అధికారంలోకి రాగానే నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలనలో టీడీపీ చేసిన తప్పిదాలను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలిస్తారన్నది మర్చిపోయి నాలుగేళ్ళ పాలనలో అవినీతి పై చర్యలు తీసుకుంటారట. అదీ సంగతి. ‘నాకు సహజంగానే కోపం కొంచెం తక్కువ. కాబట్టి కోపం అనే నరం తెగేంత దూరం వరకూ నేను ఎప్పుడూ వెళ్లే పరిస్థితి రాలేదు. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిస్తున్నాను. పాదయాత్ర అనేది ఒక వ్యక్తిలోని మానవత్వాన్ని పెంచుతుంది’ అని అన్నారు. అలాగే భవిష్యత్తులో కేంద్రంలో మీరు ఏ పార్టీకి మద్దతిస్తారు అని ప్రశ్నించగా.. ప్రత్యేక హోదాపై ఇవాళ సంతకం చేయండి. వెంటనే మద్దతు ఎవరు హోదా ప్రకటిస్తే వారికే తన మద్దతు ప్రకటిస్తానని జగన్ అన్నారు.