కందుకూరు : వల్లేటివారిపాలెంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు దివి కొండయ్య చౌదరి కాంస్య విగ్రాహన్ని ఎంఎల్సి కరణం బలరామకృష్ణమూర్తి ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ దివి కొండయ్యచౌదరి రాష్ట్ర రాజకాయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. కందుకూరు నుండి శాసన సభ్యునిగా ఎన్నికైన ఆయన శాసన సభ స్పీకర్‌గా పనిచేసి కందుకూరు అభివృద్దికి ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. కార్యక్రమంలో కదుకూరు ఎంఎల్ఎ పోతుల రామారావు, కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కనిగిరి ఎంఎల్ఎ కదిరి బాబురావు, అటవీశాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం పాల్గొన్నారు.