Home ప్రకాశం ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

407
0

టంగుటూరు : కొండెపి ఎమ్యెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయులు తూర్పు నాయుడుపాలెంలోని తన కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కుల ఎల్ఓసిలను లబ్ధిదారులకు అందజేశారు. మర్లపాడు గ్రామానికి చెందిన గోరంట్ల శ్రీనివాసులుకు రూ.1.62లక్షలు, గోసు కొండయ్యకు రూ.1.62లక్షలు, తూర్పు నాయుడు పాలెంకు చెందిన తొట్టెంపూడి మోహన్ రావుకు రూ.81వేలు కలిపి మొత్తం రూ.4.05లక్షల సీఎం సహయనిధిని పంపిణీ చేశారు.