టంగుటూరు : కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలంలో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా టిడిపిలో రెండు గ్రూపులు రచ్చకెక్కాయి. కొంతకాలంగా ఎడముఖం, పెడముఖంగా ఉంటున్న ఇద్దరు నేతలు వేరువేరుగా దామచర్ల ఆంజనేయుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చర్చనీయాంశమైంది.
జెడ్‌పిటిసి నరశింహారావు, మండల ఉపాధ్యక్షులు హనుమారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు నరసారెడ్డి, వీరనారాయణ ఆధ్వర్యంలో ఒక గ్రూపు, ఎంపిపి వై సుశీల భర్త, మర్రిపూడి సొసైటీ అధ్యక్షులు వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేరొక గ్రూపుగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. దామచర్ల, ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వేరువేరుగా నివాళులర్పించారు.