టంగుటూరు : తూర్పునాయుడుపాలెం గ్రామంలోని ఎస్టి కాలనీలో రూ.20లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంటురోడ్లను జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ శనివారం ప్రారంభించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 11వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా సిమెంటు రోడ్లు ప్రారంభిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఒంగోలు ఎంఎల్ఎ, టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎంఎల్ఎ డేవిడ్ రాజు, టీడీపీ యువనాయకులు దామచర్ల సత్య పాల్గొన్నారు.