చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ శిక్షణా కేంద్రంలో మార్కాపురం ఐటిఐ కళాశాల విద్యార్ధులకు జూన్ 25నుండి జులై 7వరకు నైపుణ్యాభివృద్ది శిక్షణా తరగతులు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. సీమెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జూన్ 25నుండి జులై 7వరకు శిక్షణా తరలు జరిగాయని ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు మెరుగైన ఉపాధి కల్పన ఉద్దేశ్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు దృవీకరణ పత్రాలు అందజేశారు. ఎలక్ర్టికల్ హౌస్ వైరింగ్, హోమ్ అప్లయన్‌సెస్‌కు సంబంధించిన శిక్షణ ఇచ్చినట్లు ఎపిఎస్ఎస్‌డిసి ఇన్‌ఛార్జి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎస్ఎస్‌డిసికి చెందిన ట్రైనర్ ఎస్‌కె బాజి పాల్గొన్నారు.