చీరాల : నూతలపాడు జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి తన తల్లిదండ్రులు కొండారెడ్డి, వెంకట సుబ్బమ్మల జ్ఞాపకార్ధం వ్రాత పుస్తకాలను అంద జేశారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన సభకు ప్రధానోపాధ్యాయులు భవనం బద్రిరెడ్డి అద్యక్షత వహించి మాట్లాడారు. అత్యున్నత స్థితి చేరాలనే పట్టుదలను పాఠశాల దశలోనే అలవర్చుకోవాలని చెప్పారు. ఉన్నతమైన లక్ష్యం ఏర్పరచు కోవాలని సూచించారు. లక్ష్యం దిశగా కష్టపడి చదివాలని చెప్పారు. విద్యార్ధుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తారని చెప్పారు. దాతలు యిచ్చిన సహకారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. సమాజానికి మీరు కూడా ఎంతో కొంత తిరిగి యివ్వాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరావు, పుష్పరాజు, శ్రీనివాసరెడ్డి, రామాంజనిదేవి శ్రీనివాసరావు, సబీహ బేగం, మాధవి, హజరత్, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.