Home ప్రకాశం బిసిల కోసం త్యాగానికి సిద్ద‌మే : ఎంఎల్ఎ ఆమంచి

బిసిల కోసం త్యాగానికి సిద్ద‌మే : ఎంఎల్ఎ ఆమంచి

425
0

చీరాల : బిసిల‌కు న్యాయం చేయ‌డంలో, బిసిల‌కు రాజ‌కీయ ప్రాధాన్య‌త క‌ల్పించ‌డంలో తాను త్యాగానికి సిద్ద‌మేన‌ని ఎంఎల్ఎ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ పేర్కొన్నారు. బిసి చైత‌న్య వేదిక అధ్య‌క్షురాలుగా వేట‌పాలెం ఎంపిటిసి మ‌ల్లెం అంజ‌మ్మ ఎన్నికైన సంద‌ర్భంగా ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని ఓపెన్ ధియేట‌ర్‌లో ఏర్పాటు చేసిన అభినంద‌న స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌ధ్యంలో బిసిలు అభివృద్ది చెందేందుకు తానెప్పుడూ స‌హ‌క‌రిస్తాన‌న్నారు. త‌న‌క‌న్నా దిగువ‌న ఉన్న బిసిల‌ను అభివృద్ది చేసేందుకు ఏ త్యాగానికైనా సిద్ద‌మేన‌ని చెప్పారు.

స‌న్మాన స‌భ‌లో డిఐజి చంద్ర‌గిరి ఏసుర‌త్నం, బిసి చైత‌న్య వేదిక రాష్ట్ర అధ్య‌క్షులు వీర‌వ‌ల్లి శ్రీ‌నివాస‌రావు, మున్సిప‌ల్ చైర్మ‌న్ మోద‌డుగు ర‌మేష్‌బాబు, వ‌డ్డెర సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు కుంచాల ఏడుకొండ‌లు, వ‌ల్లెపు శ్రీ‌నివాస‌రావు, వ‌ల్లెపు వేణుబాబు, వేట‌పాలెం ఎంపిపి బండ్ల తిరుమ‌లాదేవి, టిడిపి చీరాల మండ‌ల అధ్య‌క్షులు బుర్ల బుర‌ళి పాల్గొన్నారు.