Home ఆంధ్రప్రదేశ్ మోడీ పన్నాగం పారక ఏపీలో ప్రజాగ్రహానికి దిగొచ్చిన కేంద్రం…!

మోడీ పన్నాగం పారక ఏపీలో ప్రజాగ్రహానికి దిగొచ్చిన కేంద్రం…!

382
0

మోడీ పన్నాగం పారక ఏపీలో ప్రజాగ్రహానికి దిగొచ్చిన కేంద్రం…!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా ఇబ్బయింది పెట్టాలని చూస్తున్న మోడీ పప్పులు ఉదకడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేద్దాం అనుకున్న బీజేపీ ప్రభుత్వ పన్నాగాలు పారడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న మోడీ ఏపీ ప్రజల ఆగ్రహం ముందు మాత్రం తలవంచక తప్పడం లేదు. లోటు బడ్జెట్ పూడ్చలేదు. హోదాకి నో అంటున్నారు. రైల్వే జోన్ ఊసే లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కట్టుకుంటున్న పోలవరం ప్రాజెక్టుపై కూడా కుళ్లు కుతంత్రాలతో కొర్రీలు పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం పనులపై ఉన్న స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా పట్టించుకోకుండా చివరి నిమిషం వరకు నాన్చుడు ధోరణి అవలంభించిన మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. ఏపీలో బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా ఎదురవుతున్న ప్రజా ప్రతిఘటన దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ మీద పడుతున్న చెప్పుల దెబ్బకు బీజేపీ నేతల్లో వణుకు మొదలైనట్లే ఉంది.

ఆ భయం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో బయటకోచింది. తాజాగా పోలవరం పనులు శరవేగంగా ముందుకు సాగేందుకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. 2015 చివరిలో పోలవరం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన ‘స్టాప్‌ వర్క్‌’ ఆర్డర్‌పై స్టేను మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా బుధవారం సంతకం చేశారు. ఇక దీనికి పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆమోద ముద్ర వేయడం.. ఉత్తర్వు జారీ కావడమే తరువాయి. పోలవరం పనులపై ఎన్‌జీటీ ఇచ్చిన స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై ఉన్న స్టే గడువు జూలై 2తో ముగిసిపోనున్నదంటూ.. మీడియా కొన్ని రోజులుగా కధనాలు ప్రచురిస్తోంది. ప్రభుత్వం కూడా పనులు నిలిచిపోకుండా కేంద్రం మీద ఒత్తిడి తీస్తోంది.

వారం క్రితం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచే కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 2019 జూన్‌ నాటికి పోలవరం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణం జరుగుతున్న తరుణంలో స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌ అమలులోకి వస్తే.. ఇప్పటివరకూ పడిన కష్టమంతా వ్యర్థమ వుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హర్షవర్ధన్‌.. విదేశీ పర్యటనలో ఉన్న కార్యదర్శి మిశ్రా ఢిల్లీ రాగానే ఈ ఫైలును పరిశీలిస్తారని సీఎంకు హామీ ఇచ్చారు. మిశ్రా సోమవారం వియత్నాం నుంచి ఢిల్లీ తిరిగొచ్చారు.

స్టే కొనసాగించాలని కోరుతూ ఆంధ్ర జల వనరుల కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ రాసిన లేఖను, ఎన్‌జీటీ ఆదేశాలను గౌరవించాలంటూ ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ రాసిన లేఖనూ, దానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్నీ మిశ్రా సమగ్రంగా పరిశీలించారు. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై ఏడాదిపాటు స్టేను కొనసాగిస్తూ బుధవారం సంతకం చేశారు. అనంతరం ఈ ఫైలు మంత్రి వద్దకు చేరింది. స్టేను కొనసాగిస్తూ హర్షవర్ధన్‌ ఆమోద ముద్ర వేస్తే.. పోలవరం పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. ఇప్పటికే స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీట్‌ పనుల వేగాన్ని నిర్మాణ సంస్థ నవయుగ పెంచింది. ఇప్పుడు వర్షాలు, గోదావరి నదిలో వరద తగ్గితే.. అక్టోబరు నుంచి కాఫర్‌ డ్యాం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం పనులు ప్రారంభించేందుకు జల వనరుల శాఖ సిద్ధమవుతోంది.