Home ప్రకాశం అంబేద్క‌ర్ అంద‌రివాడు

అంబేద్క‌ర్ అంద‌రివాడు

427
0

చీరాల : ఏప్రిల్ 14న డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా పాఠ‌శాల విద్యార్ధుల‌కు సేవ‌క్ సంస్థ ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ అంద‌రివాడు అంశంపై శ‌నివారం కెజిఎం బాలికోన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హించారు. పోటీల‌లో 80మంది విద్యార్ధినులు పాల్గొన్న‌ట్లు పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు ప‌ల‌మ‌ర్తి వెంక‌టేశ్వ‌ర‌బాబు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు కె హైమావ‌తి, ఎం ముర‌ళీకృష్ణ‌, వి ప్ర‌భాక‌ర‌రావు, ప‌వ‌ని భానుచంద్ర‌మూర్తి పాల్గొన్నారు. విజేత‌ల‌కు ఏప్రిల్ 14న సేవ‌క్ సంస్థ ఆధ్వ‌ర్యంలో అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో జ‌రిగే స‌భ‌లో బ‌హుమ‌తులు అంద‌జేస్తార‌ని తెలిపారు.