Home ఆంధ్రప్రదేశ్ బాధ్యత లేని ప్రధాని మోడి : దాసరి రాజా మాష్టారు

బాధ్యత లేని ప్రధాని మోడి : దాసరి రాజా మాష్టారు

387
0

కందుకూరు : ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఆందోళన చేస్తుంటే కనీస బాధ్యత లేకుండా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టర్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో 23 రోజుల పాటు పార్లమెంట్ ను సరిగా నిర్వహించడంలో విఫలమైన మోడి, అత్యంత విఫల ప్రధానిగా దేశ చరిత్ర లో మిగిలిపోతారని అన్నారు. స్థానిక తెలుగు విజయం ప్రాంగణంలో జరుగుతున్న శిక్షణా శిభిరంలో 165వ బాచ్ ముగింపు కార్యక్రమంలో  శిక్షణకు హాజరైన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

విభజిత రాష్ట్రానికి న్యాయం చేయమని రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిథులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం డిల్లి వేదికగా పోరాడుతున్నారని చెప్పారు. నాడు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను సైతం విస్మరించి, ఒక బాధ్యత లేని ప్రధానిగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన మేకప్, వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ద ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద పెట్టుంటే బాగుండేదని ఎద్దేవా చేసారు. దొంగలతో చేతులు కలపడంతో పార్లమెంట్ ఆవరణలో చంద్రబాబు నాయుడును చూసి మొహం చాటేసే పరిస్థితికి మోడీ దిగజారి పోయారని అన్నారు.

ఇలాగె కొనసాగితే రేపు ప్రధాని పదవి నుండి కూడా దిగిపోయే పరిస్థతి వస్తుందని అన్నారు. విభజన చట్టంలో పొందుపరచిన అంశాల అమలులో కనీస చిత్తశుద్ది చూపడం లేదని పేర్కొన్నారు. చట్టంలోని అంశాలను సైతం విస్మరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులు, శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జడ్పీటిసి సభ్యులు కంచర్ల శ్రీకాంత్, శిక్షణ సిబ్బంది కాకర్ల మల్లికార్జున్, పసుపులేటి పాపారావు, చైతన్య, పరమేశ్వర్ రెడ్డి, గుంటూరు జిల్లా నుండి వేమూరు, ప్రకాశం జిల్లా నుండి చీరాల, పర్చూరు, మార్కాపురం, నెల్లూరు జిల్లా నుండి గూడూరు నియోజకవర్గ మండల, గ్రామ స్థాయి నాయకులు హాజరయ్యారు.