Home ప్రకాశం అవార్డులు పొంద‌డ‌మంటే మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయ‌డ‌మే : ఎంపిటిసి పివి తుల‌సీరామ్‌

అవార్డులు పొంద‌డ‌మంటే మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయ‌డ‌మే : ఎంపిటిసి పివి తుల‌సీరామ్‌

497
0

చీరాల : అవార్డులు పొంద‌డ‌మంటే మ‌రింత బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల్సిన బాధ్య‌త పెరిగింద‌ని అర్ధం చేసుకోవాల‌ని కొత్త‌పేట ఎంపిటిసి, జెడ్‌హైస్కూల్ క‌మిటి ప్ర‌తినిధి పివి తుల‌సీరామ్ పేర్కొన్నారు. జెడ్‌పి ఉన్న‌త పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల అవార్డులు పొందిన ఉపాధ్యాయుల‌కు అభినంద‌న స‌భ ఏర్పాటు చేశారు. స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌తిభ‌గ‌ల ఉపాధ్యాయుల‌కు ఎక్క‌డున్నా గుర్తింపు ల‌భిస్తుంద‌న్నారు. పుర‌ష్కారాలు అందిన‌ప్పుడు వారి బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని గుర్తించాల‌న్నారు. జిల్లా ఉత్త‌మ ఉపాధ్యాయులుగా పుర‌స్కారం పొందిన ఎన్ ర‌వీంద్ర‌బాబు, ప‌వ‌ని భానుచంద్ర‌మూర్తిల‌ను పాఠ‌శాల అభివృద్ది క‌మిటి, ఉపాధ్యాయ బృంధం, ప్ర‌ధానోపాధ్యాయులు ఎస్ ఇందిరాఇజ్రాయేల్ శుక్ర‌వారం పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఘ‌నంగా స‌న్మానించారు.

త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువే దైవ‌మ‌ని ప‌లువురు వ‌క్త‌లు అన్నారు. స‌మాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత విలువైన‌ద‌న్నారు. ఇత‌రుల‌తో ఉపాధ్యాయుల‌ను పోల్చ‌లేమ‌న్నారు. కార్య‌క్ర‌మంలో అభివృద్ది క‌మిటి ప్ర‌తినిధులు గ‌విని నాగేశ్వ‌ర‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, శంభుప్ర‌సాద్‌, సిహెచ్ మ‌స్తాన్‌రావు, ఎస్‌జిడి ఖురేషి, బుర్ల వెంక‌టేశ్వ‌ర్లు, సిఆర్‌పి సుజాత‌, స్టాఫ్ సెక్ర‌ట‌రీ పి శ్రీ‌నివాస‌రావు, బి నీలిమ‌, పుష్ప‌ల‌త‌, నాగ‌మ‌ణి, బిసి ఫెడ‌రేష‌న్ నాయ‌కులు యెనుమ‌ల యానాదిరావు, గుంటి ఆదినారాయ‌ణ పాల్గొన్నారు.