Home వైద్యం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపి వైద్యులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపి వైద్యులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

435
0

చీరాల : గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించ‌డంలో ఆర్ఎంపి వైద్యులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అలా ఉంటేనే ప్ర‌జ‌ల్లో మ‌రింత గౌర‌వం పెరుగుతుంద‌ని ఆర్ఎంపి వైద్యుల అసోసియేష‌న్ ప్రెసిడెంట్ టి సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు. కామాక్షి కేర్ హాస్పిట‌ల్ ఆవ‌ర‌ణ‌లో శుక్ర‌వారం చీరాల ప‌రిస‌ర ప్రాంతాల ఆర్ఎంపి వైద్యుల సాధార‌ణ స‌మావేశం నిర్వ‌హించారు. ఆర్ఎంపి వైద్యులు ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌నుండి గౌర‌వం పొందే వృత్తిలో ఉండ‌టం అదృష్ట‌మ‌న్నారు. ప్ర‌తిఒక్క‌రు అసోసియేష‌న్‌లో చేరి స‌భ్య‌తం, గుర్తింపు కార్డు తీసుకోవాల‌ని సూచించారు.

కామాక్షి కేర్ హాస్పిట‌ల్ చెవి, ముక్కు, గొంతు వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ ప‌లుకూరి సురేష్‌కుమార్ మాట్లాడారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, వాటి ల‌క్ష‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వైద్యం వివ‌రాల‌ను చెప్పారు. ఎన్‌టిఆర్ వైద్య‌సేవ ద్వారా అందుతున్న వైద్య‌సేల‌ను వివ‌రించారు. స‌మావేశంలో ఆర్ఎంపి వైద్యుల అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ పి శేఖ‌ర్‌, హాస్పిట‌ల్ మేనేజ‌ర్ తాడివ‌ల‌స సురేష్ పాల్గొన్నారు.