చీరాల : వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతోనే ప్రజలకు మెరుగైన జీవనం, కష్టాలకు సాంత్వన సాధ్యమని వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ పేర్కొన్నారు. ఈపూరుపాలెంలో ఆయన ఇంటింటికీ తిరిగి వైఎస్ఆర్‌సిపి అమలు చేయనున్న తొమ్మిది సంక్షేమ పథకాలను వివరించారు. రావాలి జగన్… కావాలి జగన్ నినాదంతో గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైఎస్ఆర్‌సిపి పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన వెంట వైసిపి గ్రామ అధ్యక్షులు గుద్దంటి సుధాకర్, ఎంపిటిసి గోలి ఆనందరావు, గోలి వెంకట్రావు, పాతచీరాల సర్పంచి రాజు శ్రీనివాసరెడ్డి, కె ఆదినారాయణ, ఎం ఆదిశేషు, అధికార ప్రతినిధి యడం రవిశంకర్ పాల్గొన్నారు.