చీరాల : వైఎస్ఆర్‌సిపి అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసిపి నాయకులు, మాజీ ఎంపి చిమటా సాంబు పేర్కొన్నారు. స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన వైసిపి చీరాల నియోజకవర్గ బూత్ కన్వెనోర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు పోవాలంటే వైఎస్ఆర్‌సిపిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశానికి వైరసిపి పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో వైసిపి నాయకులు గోలి అంజలిదేవి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కొరబండి సూరేష్, యడం రవిశంకర్, పొత్తూరి సుబ్బయ్య, కొలుకుల వెంకటేష్, పిన్నిబోయిన రామకృష్ణ, మౌన్సిలర్లు పాల్గొన్నారు.