Home ప్రకాశం ప్రజా దానంతో నిర్మించిన కార్యాలయానికి తాళమా…: అమృతపాణి

ప్రజా దానంతో నిర్మించిన కార్యాలయానికి తాళమా…: అమృతపాణి

527
0

చీరాల : ప్రజా దానంతో నిర్మించిన కార్యాలయం, పారిశుధ్య కార్మికుల శ్రమతో వచ్చిన అవార్డును అందుకుని అదే పారిశుద్ధ్య కార్మికుల ను కనీసం మారుగుదొడ్లోకి కూడా వెళ్లకుండా తాళాలు వేసుకోవడం సిగ్గుచేటని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్ అధికార పార్టీ నేతల తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల పోరాటానికి చివరి వరకు అండగా ఉంటామని చెప్పారు. మునిసిపల్ కార్మికుల సమ్మె కు సంఘీభావం ప్రకటించారు. ఆయన వెంట వైసిపి నాయకులు అవ్వారు ముసలయ్య, పొదిలి ఐస్వామి, బజ్జిబాబు, పోత్తూరి సుబ్బయ్య, చుండూరు వాసు, కర్నేటి రవి, నాయకులు పేర్లి నాని, యాతం క్రాంతికుమార్ పాల్గొన్నారు.

కార్మికుల సమ్మె…..
మున్సిపల్ పారిశుద్ధ్య పనులు ప్రావేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓ279 రద్దు చేయాలని కోరుతూ గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం విచిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతుందని సిఐటియు కార్యదర్శి ఎన్ బాబురావు ఆరోపించారు. పోటీ కార్మికులను పనిలోకి తీసుకుని కార్మికుల మద్య చిచ్చు పెట్టేందుకు సిద్ధమయిందని ఆరోపించారు. ఇలాంటి ధోరణీ మానుకోకుంటే తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవతోటి నాగేశ్వరరావు, ఎవి రమణ, వై సింగయ్య, ఏఐటీయూసీ నాయకులు ఎ బాబురావు, సాంయేలు, కోటి దాసు పాల్గొన్నారు.